SKY: సూర్యకుమార్‌.. ఒక్క మ్యాచ్‌.. రెండు రికార్డులు

సఫారీలను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. దక్షిణాఫ్రికాపై..

Published : 29 Sep 2022 19:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సఫారీలను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. దక్షిణాఫ్రికాపై తొలి టీ20లో అర్ధశతకం సాధించిన సూర్యకుమార్ (50*: 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (51*)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో 110 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ క్రమంలో సూర్యకుమార్‌ భారత సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్‌ పేరిట ఉన్న రికార్డుతోపాటు పాక్‌ ఓపెనర్‌ రికార్డులను తుడిచేశాడు. 

పొట్టి ఫార్మాట్‌లో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సూర్యకుమార్‌ అవతరించాడు. 2018లో శిఖర్ ధావన్‌ 689 పరుగులు చేయగా.. తాజాగా సూర్యకుమార్ ఇప్పటివరకు 732 పరుగులు చేశాడు. అదేవిధంగా ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. పాక్‌ ఓపెనర్‌ మహమ్మద్ రిజ్వాన్‌ 2021లో 42 సిక్స్‌లు కొట్టగా... సూర్యకుమార్‌ తాజాగా దక్షిణాఫ్రికాపై కొట్టిన మూడు సిక్స్‌లతో కలిపి 45 సిక్స్‌లకు చేరుకొన్నాడు. రిజ్వాన్‌ 26 ఇన్నింగ్స్‌ల్లో కొట్టాడు. కానీ సూర్యకుమార్‌ కేవలం 21 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్‌లో బాబర్ అజామ్‌ను అధిగమించి రెండో ర్యాంక్‌కు చేరుకొన్నాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని