Surya Kumar Yadav: మండు వేసవిలో ‘సూర్య’ ప్రతాపం.. బౌలర్లు విలవిల!
టీ20 ఫార్మాట్ ఐసీసీ ర్యాకింగ్స్లో తానెందుకు అగ్రస్థానంలో ఉన్నానో ఐపీఎల్లో బౌలర్లకు అర్థమయ్యేట్లు చెబుతున్నాడు స్కై (SKY). ఐపీఎల్ సీజన్ (IPL 2023) కొనసాగే కొద్దీ సూర్య(Surya Kumar Yadav) బ్యాటింగ్‌లో దూకుడు పెరిగిపోతోంది. సీజన్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ కీలక సమయంలో పుంజుకోవడంతో ముంబయి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: 15, 1, 0.. ఇవీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో (IPL 2023) ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తరఫున తొలి మూడు మ్యాచుల్లో ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ చేసిన పరుగులు. గత కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సూర్య.. ఐపీఎల్ ఆరంభంలోనూ విఫలమయ్యాడు. దీంతో అభిమానులు డీలా పడ్డారు. ఫామ్‌లోకి ఎప్పుడొస్తాడా అని ఆశగా ఎదురు చూశారు.
కట్ చేస్తే..
43, 7, 57, 23, 55, 66, 26, 83.. ఒక్క మ్యాచ్‌లో మినహా మిగతా అన్నింట్లోనూ రెండంకెల స్కోరు చేశాడీ మిస్టర్ 360. ఫామ్‌తో ఇబ్బంది పడి విమర్శలపాలైన సూర్య మళ్లీ జోరందుకున్నాడు. గత ఎనిమిది మ్యాచుల్లో అతడి ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు చేరాయంటే ఈ ‘టీ20’ స్పెషలిస్ట్ బ్యాటర్ పవర్ ఏంటో ప్రత్యర్థులకు అర్థమైంది. అందుకే అతడు పొట్టి ఫార్మాట్లో నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. ముంబయి ఆడిన చివరి ఎనిమిది మ్యాచుల్లో కేవలం మూడు చేజార్చుకొంది. ఆ మ్యాచుల్లో కూడా చివరి వరకూ పోరాడి మరీ ఓడింది. లేకపోతే ఈ పాటికే ప్లేఆఫ్స్ బెర్తును ముంబయి దాదాపు ఖాయం చేసుకొనే అవకాశం ఉండేది.
వన్‌డౌన్, సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు వస్తూ ముంబయి విజయాల్లో సూర్యకుమార్ (Surya Kumar Yadav) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముంబయి పరిస్థితి ఎలా ఉందంటే ‘సూర్య ఫామ్‌లోకి రాకముందు.. ఫామ్‌లోకి వచ్చాక’ అన్నట్లుగా తయారైంది. ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారుతున్న సమయంలో ‘స్కై’ విజృంభణతో ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో ముంబయి (12 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుంది. చివరి మూడు మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు. మే 12న గుజరాత్‌తో, మే 16న లఖ్‌నవూ, మే 21న హైదరాబాద్‌తో ముంబయి తలపడనుంది. సూర్య ఫామ్‌లోకి వస్తే ఎంత డేంజరస్ అనేది ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే.
అతడిని ఆపడం సులువేం కాదు: డుప్లెసిస్
‘ప్రస్తుత టీ20 క్రికెటర్లలో సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ ఆటగాడు. అతడికి బౌలింగ్ చేయడం కూడా కష్టం. ఎన్ని ఆప్షన్లు ఉన్నా అతడి దూకుడను ఆపడం సాధ్యం కాదు’ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. 200 పరుగులు లక్ష్యంగా ఉన్నప్పటికీ అది సరిపోలేదని.. మరో 20 పరుగులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో మరికొన్ని పరుగులు చేయడంలో విఫలమైనట్లు అంగీకరించాడు.
సూర్య హాఫ్ సెంచరీలు ఇలా..
♦ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబయి ఓడిపోయింది.
♦ రాజస్థాన్ రాయల్స్‌పై 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 29 బంతుల్లోనే 55 పరుగులు చేసి ముంబయిని గెలిపించాడు.
♦ పంజాబ్‌తో గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయిన సూర్య.. ఆ జట్టుతో రెండో మ్యాచ్‌లో మాత్రం ఆ పొరపాటు చేయలేదు. మరింత దూకుడుగా ఆడి మరీ 31 బంతుల్లో 66 పరుగులు చేసి విజయానికి పునాది వేసి వెళ్లాడు.
♦ తాజాగా బెంగళూరుపైనా 200 టార్గెట్‌ను ముంబయి కేవలం 16.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. దానికి కారణం సూర్యకుమార్ యాదవ్. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేశాడు.
♦ ప్రస్తుతం 11 మ్యాచుల్లో 186.14 స్ట్రైక్‌రేట్‌తో సూర్యకుమార్ 376 పరుగులు చేశాడు. ఇందులో 18 సిక్స్‌లు, 41 ఫోర్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్