IND vs NZ: సూర్యకుమార్‌.. శ్రేయస్‌.. వన్‌డౌన్‌లో ఎవరు? అశ్విన్‌ ఎంపిక ఇదే!

ప్రస్తుతం టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని భారత్‌ మూడు టీ20లను ఆడనుంది. అయితే వెల్లింగ్టన్‌ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

Published : 18 Nov 2022 23:03 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటిస్తోంది. అయితే వెల్లింగ్టన్‌ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. యువకులతో కూడిన భారత జట్టు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కీలకమైన వన్‌డౌన్‌లో ఎవరు బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రెగ్యులర్‌ జట్టు అయితే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేవాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ వచ్చేవాడు. ఇప్పుడు ఆ స్థానం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సూర్యకుమార్‌తోపాటు శ్రేయస్‌ అయ్యర్ రేసులో నిలిచాడు. మరి టీమ్ఇండియా సీనియర్‌ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌  మనసులో మాటను తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వెల్లడించాడు.

‘‘శ్రేయస్‌ అయ్యర్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తేనే ఉత్తమం. ఇక సూర్యకుమార్‌ తన నాలుగో స్థానంలోనే ఆడాలి. దీనిని లాక్‌ చేసేయొచ్చు. సూర్యను మూడో స్థానంలో పంపించడం ఉద్వేగంతో తీసుకొనే నిర్ణయం అవుతుందని భావిస్తున్నా. అందుకే ఆ స్థానానికి శ్రేయస్‌ అయ్యర్ కరెక్ట్‌. ఇక ఓపెనర్‌గా రిషభ్‌ పంత్‌ను పంపిస్తే.. ఐదో స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ కీలకమవుతాడు. అతడు లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడమే అందుక్కారణం. మిడిలార్డర్‌లో ఇంకెవరూ ఎడమ చేతివాటం బ్యాటర్లు లేరు. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌లో  లెఫ్ట్‌-రైట్ కాంబినేషన్‌ చాలా కీలకం. వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులో ఉండి బాగా ఆడితే మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది’’ అని అశ్విన్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని