Suryakumar Yadav: ‘నువ్వే నా ప్రపంచం.. నాకు భార్యగా దొరకడం నా అదృష్టం’
భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన సతీమణి దేవిశా శెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. కివీస్‌తో జరిగే మూడు టీ20లు, 3 వన్డేల సిరీస్‌కు అతడు ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి పుట్టిన రోజు నేడు (నవంబర్ 17) . ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సూర్యకుమార్ తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
‘హ్యాపీ బర్త్‌డే టూ మై బ్యూటీఫుల్ వైఫ్. నువ్వే నా ప్రపంచం. నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతావు. నన్నెప్పుడూ మోటీవేట్ చేస్తూ ఆటపై దృష్టి పెట్టేలా చేస్తావు. నువ్వు లేకుండా నేను ఏమి చేస్తానో నాకు నిజంగా తెలియదు. నువ్వు భార్యగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం' అని రాసుకొచ్చి వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు దేవిశా శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘బ్యూటీఫుల్ కపుల్’ ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.
ఇక, టీమ్ఇండియా న్యూజిలాండ్ పర్యటన విషయానికొస్తే.. నవంబర్ 18 నుంచి టీ20 సిరీస్,25 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.భారత జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. భారత్, కివీస్ మధ్య తొలి టీ20 వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభంకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్యచక్ర
-
Ap-top-news News
Andhra News: కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్
-
Crime News
Crime News: బ్రెయిన్ మ్యాపింగ్‌తో హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
Politics News
Balakrishna: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం
-
Sports News
MS Dhoni: కొబ్బరి బొండం పట్టుకుని.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి..
-
Politics News
Andhra News: ‘పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదు.. నేను చాలు’