ICC T20 rankings: టాప్‌లోనే స్కై.. ఆల్‌రౌండర్‌ కేటగిరిలో దూసుకొచ్చిన స్టోయినిస్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ బ్యాటర్‌గా టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కొనసాగుతున్నాడు.

Published : 19 Jun 2024 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో గొప్పగా రాణిస్తున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. అఫ్గాన్‌ ఆటగాడు నబీని వెనక్కి నెట్టి ఆల్‌రౌండర్‌ కేటగిరిలో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ 190 స్ట్రైక్‌ రేట్‌తో స్టాయినిస్‌ 156 పరుగులు చేశాడు. బంతితోనూ రాణిస్తూ 6 వికెట్లు తీసి జట్టు సూపర్‌ 8 చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 

*ఈ విభాగంలో నబీ నాలుగో స్థానానికి పడిపోగా.. శ్రీలంక కెప్టెన్‌ హసరంగ, బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
*పొట్టి ఫార్మాట్‌లో టాప్‌ బ్యాటర్‌గా టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కొనసాగుతున్నాడు. అతడి తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఉన్నారు.
*ఇక టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో.. టీమ్‌ఇండియా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని