Sushil kumar: రెజ్లర్‌ సుశీల్‌కుమార్ అరెస్ట్

ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుశీల్‌..

Updated : 23 May 2021 10:35 IST

దిల్లీ: ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుశీల్‌.. గత 15 రోజులుగా పరారీలో ఉండగా.. జలంధర్‌ సమీపంలో అరెస్టయ్యాడు. 

ఈనెల 4న ఛత్రసాల్‌ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్‌ అనే 23 ఏళ్ల రెజ్లర్‌ మరణించాడు. సుశీల్‌ కుమార్‌ దాడి వల్లే సాగర్‌ చనిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మరోవైపు సుశీల్‌కుమార్‌ ముందస్తు బెయిలు దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని