Sushil Kumar: సుశీల్ దాడి చేసిన వీడియోల కలకలం!
యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీ హిందీ, ఇంగ్లిష్ మీడియాలో ప్రసారం అవుతోంది. ....
దిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీ హిందీ, ఇంగ్లిష్ మీడియాలో ప్రసారం అవుతోంది. ఛత్రసాల్ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్ బేస్‌బాల్ స్టిక్/కర్రను చేతిలో పట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో అతడికి మరింత నష్టం కలగనుంది.
కొన్ని రోజుల క్రితం ఛత్రసాల్ స్టేడియంలో సాగర్‌రాణాపై సుశీల్ బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత సుశీల్ ఈ వీడియో తీయించాడు. దానిని రెజ్లింగ్ వర్గాలకు పంపించాలనుకున్నాడు. కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల గాలింపు.. లక్ష రూపాయల రివార్డు.. ముందుస్తు బెయిల్ తిరస్కరణ.. కోర్టు రిమాండ్.. దర్యాప్తునకు సహకరించకపోవడం వంటి విషయాలు తెలిసినవే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం
-
KTR: మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ ఖాయం: కేటీఆర్
-
Ram Charan: కొత్త ఫ్రెండ్‌ని పరిచయం చేసిన రామ్ చరణ్.. ఎవరంటే?
-
AP HighCourt: బండారు పిటిషన్‌పై విచారణ వాయిదా
-
AP Voter List: ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఉపాధ్యాయులకే అప్పగించండి: సీఎఫ్‌డీ
-
Rolls Royce: యువకుడి నైపుణ్యం.. మారుతి కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు