Sushil Kumar: బాకీ చెల్లించమంటే సుశీల్‌ దాడి

రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ నేర స్వభావ ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్టేడియంలోనే  కాకుండా బయటా అతడి ప్రవర్తన కటువుగానే ఉండేదని సమాచారం. ...

Updated : 31 May 2021 13:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ నేర స్వభావ ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్టేడియంలోనే  కాకుండా బయటా అతడి ప్రవర్తన కటువుగానే ఉండేదని సమాచారం. బాకీ పడ్డ రూ.4లక్షల సొమ్మును చెల్లించాలని కోరగా ఓ దుకాణాదారుడిని అతడు తీవ్రంగా కొట్టాడని తెలుస్తోంది. భయపడ్డ అతడు అప్పట్నుంచి డబ్బులు అడగడం మానేశాడట.

చాలాకాలంగా ఛత్రసాల్‌ స్టేడియంలోనే సుశీల్‌ కుమార్‌ సాధన చేసే సంగతి తెలిసిందే. అక్కడ శిక్షణ తీసుకొనే రెజ్లర్లకు సమీపంలోని ఓ దుకాణాదారు నిత్యావసరాలు సరఫరా చేస్తుండేవారు. తర్వాత డబ్బులు తీసుకొనేవారు. ఈ క్రమంలోనే సుశీల్‌ కుమార్‌కు ఆయన నిత్యావసరాలు, ఎండు ఫలాలు సరఫరా చేశాడు. అతడు డబ్బులు చెల్లించకపోవడంతో రూ.4 లక్షల వరకు బాకీ పడ్డాడు. డబ్బులు చెల్లించాలని కోరగా సుశీల్‌ తనపై దాడి చేశాడని సదరు దుకాణాదారు మీడియాకు చెప్పాడు. ఆ తర్వాత అతడి మిత్రులూ బెదిరించేవారని వెల్లడించాడు. భయపడ్డ అతడు రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని తెలపడం గమనార్హం.

సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌పై ఉచ్చు బిగుస్తోంది. ప్రత్యక్ష సాక్షులు అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని తెలిసింది. అంతేకాకుండా గ్యాంగ్‌స్టర్లతో అతడి సంబంధాలను వెలికి తీస్తున్నారు. అతడితో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు. వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని