Sushil Kumar: రైల్వే ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌

ప్రముఖ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు మరో షాక్‌. హత్య కేసులో అరెస్టయిన అతడిని రైల్వేశాఖ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసింది. అతడు అరెస్టయిన 48 గంటల్లోనే రైల్వేబోర్డు ఈ నిర్ణయం తీసుకుంది....

Published : 25 May 2021 19:34 IST

దిల్లీ: ప్రముఖ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు మరో షాక్‌. హత్య కేసులో అరెస్టయిన అతడిని రైల్వేశాఖ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసింది. అతడు అరెస్టయిన 48 గంటల్లోనే రైల్వేబోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సుశీల్ కుమార్‌ ఇండియన్‌ రైల్వేస్‌లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్లు రైల్వేబోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు పేర్కొంది.

సాగర్‌ రాణా అనే యువ రెజ్లర్‌ హత్య కేసులో సుశీల్‌ కుమార్‌తోపాటు అజయ్‌ కుమార్‌ అనే మరో వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి అద్దె విషయంలో సుశీల్‌కు, సాగర్‌కు గతంలో గొడవలు జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. ఛత్రసాల్‌ స్టేడియంలో నెలరోజుల క్రితం సాగర్‌ రాణాపై దాడి జరిగింది. ఈ ఘటనలో రాణా మృతిచెందాడు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకోగా వారు సుశీల్‌ పేరు వెల్లడించారు. కాగా అప్పటి నుంచి రెజ్లర్‌ తప్పించుకొని తిరిగాడు. దాదాపుగా మూడు వారాలపాటు పోలీసులు అతడికి కోసం గాలించి ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని