INDIA: భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ స్టిమాక్‌పై వేటు

భారత సీనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఇగర్‌ స్టిమాక్‌పై వేటు పడింది. ఇంకో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే స్టిమాక్‌ను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) తప్పించింది.

Published : 18 Jun 2024 02:51 IST

దిల్లీ: భారత సీనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఇగర్‌ స్టిమాక్‌పై వేటు పడింది. ఇంకో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే స్టిమాక్‌ను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) తప్పించింది. ఇటీవల ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు సులువైన డ్రా పడ్డప్పటికీ.. రెండో రౌండ్లోనే నిష్క్రమించడంతో స్టిమాక్‌పై ఏఐఎఫ్‌ఎఫ్‌ చర్యలు చేపట్టింది. స్టిమాక్‌ 2019లో భారత కోచ్‌గా నియమితుడయ్యాడు. గత ఏడాది అక్టోబరులో 2026 వరకు అతడి పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇటీవల భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో స్టిమాక్‌పై వేటు పడింది. ‘‘ఫిఫా ప్రపంచకప్‌ అర్హత టోర్నీలో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కోచ్‌ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. స్టిమాక్‌ను పదవి నుంచి తప్పిస్తూ నోటీసు ఇచ్చాం. అతను తక్షణం బాధ్యతల నుంచి తప్పుకొంటాడు’’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. కాంట్రాక్టును మధ్యలో రద్దు చేసినందుకు 56 ఏళ్ల స్టిమాక్‌కు ఏఐఎఫ్‌ఎఫ్‌ రూ.3 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు