EURO cup: ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌కు షాక్‌

ఫుట్‌బాల్ ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌కు స్విట్జర్లాండ్‌ షాక్‌ ఇచ్చింది. యూరో  కప్‌ ప్రిక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించింది. ఆద్యంతం

Updated : 29 Jun 2021 04:33 IST

బుచరెస్ట్‌: ఫుట్‌బాల్ ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌కు స్విట్జర్లాండ్‌ షాక్‌ ఇచ్చింది. యూరో  కప్‌ ప్రిక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించింది. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 3-3 గోల్స్‌తో సమంగా నిలవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి మళ్లింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్‌ చేయలేకపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. దీంతో స్విట్జర్లాండ్‌ 5 పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మార్చగా, ఫ్రాన్స్‌ నాలుగింటిని గోల్స్‌ చేసి చివరి అవకాశాన్ని జారవిడిచింది. ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబపె పెనాల్టీ కిక్‌ను స్విట్జర్లాండ్‌ గోల్‌కీపర్‌ యాన్‌ సోమర్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో స్విట్జర్లాండ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కి దూసుకెళ్లింది. తన తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

 
ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్విట్జర్లాండ్‌ మ్యాచ్‌ 15వ నిమిషంలో సెఫెరోవిక్‌ గోల్‌ చేయడంతో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. అయితే భారీ అంచనాలతో ఆటలో ఆధిపత్యం ప్రదర్శించిన ఫ్రాన్స్‌ 57, 58 నిమిషాల్లో వరుస గోల్స్‌ చేసి 2-1 తేడాతో ఆటపై పట్టు బిగించింది. అనంతరం పొగ్బా (75 వ నిమిషం)లో గోల్‌ చేసి ఫ్రాన్స్‌ను మరింత ముందుకు చేర్చాడు. దీంతో ఫ్రాన్స్‌ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే 81 నిమిషంలో సెఫెరోవిక్‌ మరోసారి గోల్‌చేసి ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. ఇక 90వ నిమిషంలో స్విట్జర్లాండ్‌ ఆటగాడు స్నాచ్‌ గోల్‌ చేయడంతో మ్యాచ్‌ 3-3తో సమంగా నిలిచింది. అనంతరం 30 నిమిషాల అదనపు సమయం ఇచ్చినప్పటికీ ఇరు జట్లు గోల్‌ చేయలేకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని