T20 Cricket: బిగ్‌ బాష్‌ లీగ్‌లో సంచలనం.. 15 పరుగులకే ఆలౌట్‌

బిగ్ బాష్‌ లీగ్‌లో సంచలనం నమోదైంది.  అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీథండర్స్‌ 15 పరుగులకే ఆలౌటైంది. టీ 20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. 

Published : 16 Dec 2022 22:59 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్ అంటేనే సంచనాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎప్పుడు.. ఏ జట్టు..ఎలా ఆడుతోంది అంచనా వేయలేం. నిండా స్టార్లున్న జట్లు కూడా ఒక్కోసారి పేలవ ప్రదర్శన చేస్తే.. పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లు జట్లు అంచనాలకు మించి రాణిస్తాయి. ఇలాంటి సంచలనమే ఇప్పుడు బిగ్‌ బాష్‌ టీ20 లీగ్‌లో నమోదైంది.  శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌, సిడ్నీథండర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.  140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్‌ 15 పరుగులకే కుప్పకూలి టీ20 క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతకుముందు ఈ రికార్డు టర్కీ జట్టు పేరిట ఉండేది. సిడ్నీ జట్టులో ఏ ఒక్కరూ రెండంకెల స్కోరును సాధించలేదు. అడిలైడ్‌ బౌలర్లలో  హెన్రీ థాంప్టన్‌ ఐదు వికెట్లు తీయగా, వెస్ అగర్ నాలుగు వికెట్లు మాథ్యూ షార్ట్ ఒక వికెట్ తీశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని