
PV Sindhu:రెండేళ్ల దాహం తీరిన వేళ.. సయ్యద్ మోదీ టోర్నీ ఫైనల్లో సింధు విజయం
ఇంటర్నెట్ డెస్క్: సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన ఫైనల్ పోరులో భారత్‌కే చెందిన యువ క్రీడాకారిణి మాళవిక బన్సోద్‌ను వరుస సెట్లలో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడిన సింధు మొదటి సెట్‌ను 21-13, రెండో సెట్‌ను 21-16తో గెలుపొంది. కేవలం 35 నిమిషాల్లోనే సింధు ఈ పోరును ముగించడం విశేషం.
సింధుకు ఇది రెండో సయ్యద్ మోదీ ట్రోఫీ. మొదట 2017లో ఈ టైటిట్ చేజిక్కించుకుంది. 2019లో గ్లాస్గోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తర్వాత.. మరే అంతర్జాతీయ పోరులోనూ సింధుకు టైటిల్ దక్కలేదు. సింధు గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత సింధుకు ఇదే మొదటి టైటిల్.