IND vs SL: జనవరిలో క్రికెట్‌ మజా.. భారత్‌ - శ్రీలంక సిరీస్‌లు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా చూడొచ్చు?

బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ విజయంతో 2022వ ఏడాదిని ముగించిన టీమ్‌ఇండియా (Team India).. కొత్త సంవత్సరంలోనూ అభిమానుల కోసం భారీగా మ్యాచ్‌లను ఆడనుంది. తొలుత శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల్లో (Ind vs SL) తలపడనుంది. 

Updated : 02 Jan 2023 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ అభిమానులకు కొత్త సంవత్సరం సంబరాలతోపాటు మ్యాచ్‌ల మజాను అందించేందుకు టీమ్‌ఇండియా సన్నద్ధమైంది. నూతన సంవత్సరంలో భారత్‌ వరుస మ్యాచ్‌లతో బిజీగా బిజీగా ఉంటూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. జనవరి మూడో తేదీ నుంచే శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించిన స్క్వాడ్‌లను ఆయా క్రికెట్‌ బోర్డులు ప్రకటించాయి. మరి స్వదేశంలో జరిగే మ్యాచ్‌లు ఎక్కడ, ఎప్పుడు, ఎలా వీక్షించాలో తెలుసుకొందాం.. 

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమ్‌ఇండియా (Team India) కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) వ్యవహరిస్తాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేరు. అయితే వన్డే సిరీస్‌లో ఆడతారు. రెండు సిరీసుల్లోనూ రిషభ్‌ పంత్‌కు చోటు కల్పించలేదు. అతడి స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చింది. అయితే తుది జట్టులో ఉండేందుకు ఇషాన్‌ కిషన్‌తో సంజూ పోటీ పడకతప్పదు. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై డబుల్‌ సెంచరీ సాధించి ఇషాన్‌ మంచి ఊపుమీదున్నాడు. 

T20లు ఇలా.. 

* తొలి టీ20 మ్యాచ్‌: ముంబయి వేదికగా జనవరి 3, మంగళవారం

* రెండో టీ20 మ్యాచ్: పుణె వేదికగా జనవరి 5, గురువారం

* మూడో టీ20 మ్యాచ్‌: రాజ్‌కోట్ వేదికగా జనవరి 7, శనివారం

జట్ల వివరాలు.. 

భారత్: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠీ, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌పటేల్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శివం మావి, ముకేశ్‌ కుమార్‌

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, డాసున్ శనక (కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్, భానుక రాజపక్స, అషెన్ బండార, మహీశ్‌ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కాసున్ రజిత, దునిల్ వెల్లలాగే, ప్రమోద్‌ మదుషాన్, లాహిరు కుమార, నువాన్ తుషారా

వన్డేలు ఇలా.. 

* మొదటి వన్డే: గువాహటి వేదికగా జనవరి 10, మంగళవారం

* రెండో వన్డే: కోల్‌కతా వేదికగా జనవరి 12, గురువారం 

* మూడో వన్డే: తిరువనంతపురం వేదికగా జనవరి 15, ఆదివారం

జట్ల వివరాలు..

భారత్: రోహిత్‌ శర్మ(కెప్టెన్), హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

శ్రీలంక: పాతుమ్‌ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, డాసున్ శనక (కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, నువనిందు ఫెర్నాండో, చమిక కరుణరత్నె, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్,  అషెన్ బండార, మహీశ్‌ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కాసున్ రజిత, దునిల్ వెల్లలాగే, ప్రమోద్‌ మదుషాన్, లాహిరు కుమార, జెఫ్రే వండర్సే

భారత్‌లోనే మ్యాచ్‌లన్నీ జరుగుతాయి. కాబట్టి మ్యాచ్‌లను వీక్షించే సమయం అనువుగానే ఉంటుంది. టీ20లు అన్నీ రాత్రి 7 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. మ్యాచ్‌ల అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా  భారత్‌లో స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రసారం చేయనుంది. స్టార్‌స్పోర్ట్స్‌ ఛానెల్స్‌తోపాటు డిస్నీ - హాట్‌స్టార్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని