
T20 Challenge : స్మృతీ మంధాన టీమ్ చేతిలో ఓడినా.. ఫైనల్‌కు చేరిన దీప్తి శర్మ జట్టు
పుణె: మహిళల టీ20 ఛాలెంజ్ పోటీల్లో దీప్తి శర్మ టీమ్‌పై స్మృతీ మంధాన జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినా రన్‌రేట్ ఆధారంగా దీప్తి శర్మ జట్టే ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్మృతీ మంధాన టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం దీప్తి శర్మ జట్టు 174/9 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. కిరణ్ నవ్‌గిరే (69) అర్ధశతకం సాధించాడు. షఫాలీ వర్మ 29, యస్తిక భాటియా 19, లారా వాల్వొర్డ్ 17, దీప్తి శర్మ 2, స్నేహ్ రాణా 11, రాధా యాదవ్ 2, సిమ్రన్ బహదుర్, కేట్ క్రాస్, నాథకన్ చంతమ్ 3 పరుగులు చేశారు. స్మృతీ మంధాన జట్టు బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, పూనమ్ యాదవ్2.. రేణుక సింగ్, హేలీ మ్యాథ్యూస్, సల్మా ఖాతున్, సోఫియా తలో వికెట్ తీశారు. మే 28న హర్మన్ ప్రీత్ టీమ్‌తో దీప్తి శర్మ జట్టు ఫైనల్‌లో తలపడనుంది.
రోడ్రిగ్స్, మేఘన వీర విహారం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్మృతీ మంధాన టీమ్ దూకుడుగా ఆడింది. కెప్టెన్ స్మృతీ మంధాన (1) విఫలమైనా సబ్బినేని మేఘన (73), రోడ్రిగ్స్ (66) వీరవిహారం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగులను జోడించారు. ఆ తర్వాత వచ్చిన హేలే మ్యాథ్యూస్ (27), డంక్‌లే (19) ధాటిగా ఆడారు. దీంతో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీప్తి శర్మ జట్టు బౌలర్లలో సిమ్రన్ బహదుర్ 2.. కేట్ క్రాస్, స్నేహ్ రాణా, ఖాకా తలో వికెట్ తీశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra: మెట్రో కార్‌షెడ్‌పైనే శిందే తొలి నిర్ణయం.. మాజీ బాస్ నిర్ణయం పక్కకు..!
-
Technology News
OnePlus Nord 2T 5G: వన్ ప్లస్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ఆ తేదీల్లో కొనుగోళ్లపై ఆఫర్స్!
-
World News
North Korea: విదేశీ వస్తువులను తాకడం వల్లే.. మా దేశంలో కరోనా..!
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో పోరులో భారత ఐదో బౌలర్ ఎవరు?
-
General News
Rath Yatra: అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
Movies News
Manchu Lakshmi: నటన.. నా కలలో కూడా ఊహించలేదు: మంచులక్ష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!