T20 League 2022 Final: ‘బట్లర్.. అతడి బౌలింగ్‌లో జాగ్రత్త’
(photo: Jos Buttler insta)
ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని గంటల్లో టీ20 లీగ్ తుది సమరం ప్రారంభంకానుంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, రాజస్థాన్ జట్లు టైటిల్ పోరులో ఢీకొననున్నాయి. ఈ సీజన్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 16 మ్యాచ్‌ల్లో 58.86 సగటుతో 824 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో బట్లర్ మరోసారి చెలరేగి జట్టుకు టైటిల్‌ని అందించాలని రాజస్థాన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బట్లర్‌కు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ కీలకమైన సూచన చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో బట్లర్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి, ఇతర బౌలర్ల ఓవర్లలో పరుగులు రాబట్టాలని మంజ్రేకర్ సూచించాడు. ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ తుది జట్టులో వ్యూహత్మక మార్పులు చేయాలని అభిప్రాయపడ్డాడు.
‘గుజరాత్ జట్టు మొదటి ఆరు ఓవర్లలో రషీద్ ఖాన్‌తో బౌలింగ్ చేయించొచ్చు. ఎందుకంటే అతడు వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేస్తాడు. బంతి నేరుగా స్టంప్స్ మీదికి వస్తే బట్లర్ ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి, అతడి బౌలింగ్‌లో బట్లర్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. అలాగే, రాజస్థాన్ బౌలర్లు రషీద్‌ఖాన్‌ని తొందరగా ఔట్ చేయాలి. క్వాలిఫయర్-1లో అల్జారీ జోసెఫ్ (గుజరాత్) బాగా బౌలింగ్ చేయలేదు. అతడు రెండు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చాడు. పేస్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉండే పిచ్ కాబట్టి గుజరాత్ అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్‌ని తుది జట్టులోకి తీసుకుంటుదని భావిస్తున్నా’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rajeev Kanakala: ఆ విషయంలో తారక్ నేనూ పోటీపడేవాళ్లం: రాజీవ్ కనకాల
-
Ap-top-news News
Lambasingi: మన్యంలో మంచు దుప్పటి!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్చేయండి
-
Ap-top-news News
Andhra News: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ధైర్య సాహసాలు.. సిక్కోలు అమ్మాయికి ప్రశంసలు
-
Crime News
Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!