Lucknow vs Gujarat: గుజరాత్ చేతిలో లఖ్‌నవూ ఘోర పరాజయం..
టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న లఖ్‌నవూ, గుజరాత్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
పుణె: లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 13.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. లఖ్‌నవూ బ్యాటర్లలో దీపక్ హుడా (27) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో డికాక్ (11), కేఎల్ రాహుల్ (8), కరన్ శర్మ (4), కృనాల్ పాండ్య (5), ఆయుష్ బదోని (8), స్టొయినిస్ (2), హోల్డర్ (1), మోసిన్ ఖాన్ (1), అవేశ్ ఖాన్ (12) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ఖాన్ 4, యశ్ దయాల్ 2, సాయి కిషోర్ 2, షమి 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరింది.
వరుసగా వికెట్లు కోల్పోతున్న లఖ్‌నవూ
లఖ్‌నవూ వరుసగా వికెట్లు కోల్పోతోంది. సాయి కిషోర్ వేసిన 11 ఓవర్లో ఆయుష్ బదోని (8) స్టంపౌట్ అయ్యాడు. రషీద్‌ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో స్టొయినిస్ (2) రనౌట్ కాగా.. అదే ఓవర్లో చివరి బంతికి హోల్డర్ (1) వికెట్ల ముందు దొరికిపోయాడు. సాయి కిషోర్ వేసిన 13 ఓవర్లో చివరి బంతికి మోసిన్ ఖాన్ (1) రషీద్ ఖాన్‌కు చిక్కాడు. 13 ఓవర్లకు లఖ్‌నవూ 70/8తో ఉంది. దీపక్ హుడా (27) క్రీజులో ఉన్నాడు.
బౌలింగ్‌లో అదరగొట్టిన లఖ్‌నవూ బ్యాటింగ్‌లో తడబడుతోంది. స్వల్ప వ్యవధిలో కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (8)ని ఐదో ఓవర్లో షమి వెనక్కి పంపాడు. యశ్ దయాల్ వేసిన తర్వాతి ఓవర్లో కరన్ శర్మ (4) డేవిడ్ మిల్లర్‌కు చిక్కాడు. రషీద్‌ఖాన్ వేసిన ఎనిమిదో ఓవర్లో కృనాల్ పాండ్య (5) స్టంపౌట్ అయ్యాడు. 8 ఓవర్లకు లఖ్‌నవూ 4 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. దీపక్ హుడా (17), ఆయుష్ బదోని (1) క్రీజులో ఉన్నారు.
ఛేదనకు దిగిన లఖ్‌నవూ.. క్వింటన్ డికాక్ ఔట్
145 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (11) ఔటయ్యాడు.యశ్ దయాల్ వేసిన నాలుగో ఓవర్లో మూడో బంతికి అతడు సాయి కిషోర్‌కి చిక్కాడు. దీంతో 19 పరుగుల వద్ద లఖ్‌నవూ మొదటి వికెట్ కోల్పోయింది. నాలుగు ఓవర్లకు లఖ్‌నవూ 23/1 స్కోరుతో ఉంది. కేఎల్ రాహుల్ (8), దీపక్ హుడా (4) క్రీజులో ఉన్నారు.
అర్ధ శతకంతో మెరిసిన శుభమన్ గిల్.. లఖ్‌నవూ టార్గెట్ ఎంతంటే?
లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ పూర్తయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ (63*; 49 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకంతో మెరిశాడు. డేవిడ్ మిల్లర్ (26) ఫర్వాలేదనిపించాడు. గుజరాత్ మిగతా బ్యాటర్లలో వృద్ధీమాన్ సాహా (5), మథ్యూ వేడ్ (10), హార్దిక్ పాండ్య (11) పరుగులు చేశారు. రాహుల్ తెవాతియా (22) నాటౌట్‌గా నిలిచాడు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మోసిన్ ఖాన్, హోల్డర్ తలో వికెట్ తీశారు.
నిలకడగా ఆడుతున్న గుజరాత్ బ్యాటర్లు.. క్రీజులో డేవిడ్ మిల్లర్, గిల్
గుజరాత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతోంది. కృనాల్ పాండ్య వేసిన 11వ ఓవర్లో 10 పరుగులు రాగా.. జేసన్ హోల్డర్ వేసిన తర్వాతి ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. కృనాల్ పాండ్య వేసిన 13వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. మోసిన్‌ఖాన్ వేసిన 14వ ఓవర్లో ఐదు, అవేశ్‌ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (18), శుభమన్ గిల్ (47) క్రీజులో ఉన్నారు.
నెమ్మదిగా ఆడుతున్న గుజరాత్.. మూడు వికెట్లు డౌన్
గుజరాత్ నెమ్మదిగా ఆడుతోంది. మరోవైపు.. వికెట్లూ కోల్పోతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (11) ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ వేసిన 10వ ఓవర్లో తొలి బంతికి వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కృనాల్ పాండ్య వేసిన ఏడో ఓవర్లో నాలుగు పరుగులు రాగా.. జేసన్ హోల్డర్ వేసిన తర్వాతి ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (2), శుభమన్ గిల్ (30) క్రీజులో ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. దుష్మంత వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు ఊపు మీద కనిపించిన మథ్యూ వేడ్ (10).. అవేశ్‌ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో పెవిలియన్ చేరాడు. అతడు వికెట్ కీపర్ డికాక్‌కు చిక్కాడు. దీంతో 24 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లకు గుజరాత్ 35/2 స్కోరుతో ఉంది. శుభమన్ గిల్ (19), హార్దిక్ పాండ్య (1) క్రీజులో ఉన్నారు.
ప్రారంభమైన మ్యాచ్.. గుజరాత్‌కు షాక్
లఖ్‌నవూ, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ వృద్ధీమాన్ సాహా (5) ఔటయ్యాడు. మోసిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్లో అతడు అవేశ్ ఖాన్‌కి చిక్కాడు. మూడు ఓవర్లకు గుజరాత్ 13/1 స్కోరుతో ఉంది. మథ్యూ వేడ్ (1), శుభమన్ గిల్ (7) క్రీజులో ఉన్నారు.
టాస్ నెగ్గిన గుజరాత్
టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న లఖ్‌నవూ, గుజరాత్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో దాదాపుగా ప్లే ఆఫ్స్‌కి చేరాయి. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. చూడాలి మరి ఏ జట్టు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్‌ని దక్కించుకుంటుందో!
గుజరాత్ జట్టు: వృద్ధీమాన్ సాహా, శుభమన్ గిల్, మథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్‌ఖాన్, సాయి కిషోర్, అల్జరీ జోసెఫ్, యశ్ దయాల్, మహ్మద్ షమి.
లఖ్‌నవూ జట్టు: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, కరన్ శర్మ, దుష్మంత చమీర, అవేశ్‌ఖాన్, మోసిన్ ఖాన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్‌గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్‌కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్‌కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్‌కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్‌కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్‌లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని