T20 League: అర్ష్‌దీప్‌ టీమ్‌ఇండియాకి ఎంపిక కావొచ్చు: పార్థివ్‌ పటేల్‌

టీ20 లీగ్‌లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎడమ చేతివాటం ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్ పార్థివ్‌ పటేల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టమైన పరిస్థితులు, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ మంచి క్రమశిక్షణతో

Published : 28 Apr 2022 01:40 IST

(photo: Arshdeep Singh Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎడమ చేతివాటం ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్ పార్థివ్‌ పటేల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టమైన పరిస్థితులు, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ మంచి క్రమశిక్షణతో బౌలింగ్‌ చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాడని వివరించాడు. అతడు భవిష్యత్‌లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌ 140-145 కి.మీ. వేగంతో బంతులను సంధించకపోవచ్చని, అయితే అనుకున్న విధంగా తన ప్రణాళికలను అమలు చేస్తున్నాడని పార్థివ్‌ పటేల్‌ చెప్పాడు. 

"గతేడాది జరిగిన టీ20 లీగ్‌ నుంచి అర్ష్‌దీప్ సింగ్ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. టీమ్‌ఇండియాకు మంచి లెప్టార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ కావాలని ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయి. అర్ష్‌దీప్ సింగ్‌, నటరాజన్, ఖలీల్ అహ్మద్ లాంటివారు ఈ జాబితాలో ఉన్నారు. అర్ష్‌దీప్‌ 140-145 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయకపోయినా, ఒత్తిడిలో అతడు తన ప్రణాళికలను ఖచ్చితంగా అమలుపరుస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు’ పార్థివ్ పటేల్‌ వివరించాడు. గతేడాది టీ20 లీగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్ పంజాబ్‌ తరఫున మంచి బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడు 2021లో శ్రీలంక పర్యటనకు టీమ్ఇండియా నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని