T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ విజేతకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ప్రైజ్‌మనీ ఉండటం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. గతేడాది ప్రైజ్‌మనీకి.. ఈసారి విజేతలకు దక్కే ప్రైజ్‌మనీకి తేడా లేదు. దాదాపు నెల రోజులపాటు జరిగే మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.13 కోట్లు) అందనుంది. అలాగే రన్నరప్‌నకు 0.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.5 కోట్లు) దక్కనుంది. మొత్తం ప్రైజ్ మనీ కోసం 5.6 మిలియన్ డాలర్లు (దాదాపు 45.68 కోట్లు) వెచ్చిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ఇక సెమీఫైనల్లో ఓడిన ఒక్కో జట్టు 4 లక్షల డాలర్లను(రూ. 3.25 కోట్లు) సొంతం చేసుకుంటుంది. సూపర్-12లో నిష్క్రమించిన ఒక్కో టీమ్‌కు 70వేల డాలర్లు (రూ. 57 లక్షలు) అందుతాయి. అలాగే గత టీ20 ప్రపంచకప్ తరహాలోనే.. ఈసారి కూడా సూపర్-12 దశలో ఒక్కో విజయానికి అదనంగా 40వేల డాలర్లను (రూ.32 లక్షలు) ఆయా టీమ్‌లు అందుకుంటాయని ఐసీసీ పేర్కొంది. సూపర్-12 స్టేజ్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం రూ. 9.60 కోట్లు బహుమతిగా అందుతుంది.
భారత్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నేరుగా సూపర్-12 దశలో తలపడతాయి. నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే టీమ్‌ల మధ్య జరిగే మ్యాచుల్లో విజేతలుగా నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. మొదటి దశలో ఒక్కో మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టూ 40వేల డాలర్లను (రూ. 32 లక్షలు) సొంతం చేసుకుంటుంది. రౌండ్-1లో జరిగే 12 మ్యాచ్‌లకు 4.8 లక్షల డాలర్లను (రూ.3.84 కోట్లు) ప్రైజ్‌మనీగా ఐసీసీ ఇవ్వనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే