
T20 World Cup 2021 Semi Final 2: దంచి కొట్టిన పాక్.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (67; 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫకార్ జమాన్ (55; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచికొట్టారు. బాబర్ అజామ్ (39; 34 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్, జంపా తలో వికెట్ తీశారు.
అదిరే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాక్స్‌వెల్ వేసిన మూడో ఓవర్‌లో చెరో ఫోర్ కొట్టగా.. హేజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో రిజ్వాన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో పాక్ 9 ఓవర్లకు 68/0తో నిలిచింది. ఈ క్రమంలోనే జంపా వేసిన పదో ఓవర్‌లో చివరి బంతికి బాబర్ అజామ్.. వార్నర్‌కి చిక్కాడు. తర్వాత రిజ్వాన్ జోరు పెంచాడు. జంపా వేసిన వేసిన 12 ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన 17వ ఓవర్‌లో రిజ్వాన్ ఫోర్, సిక్సర్ బాదగా.. జమాన్ కూడా సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్‌లో రిజ్వాన్.. స్మిత్‌కి చిక్కాడు. అదే ఓవర్లో జమాన్ ఫోర్, సిక్స్ కొట్టాడు. 19 ఓవర్‌లో అసిఫ్ అలీ (0), చివరి ఓవర్‌లో షోయబ్ మాలిక్ (1) వెనుదిరిగారు. ఆఖరి ఓవర్‌లో ఫకార్ జమాన్ రెండు సిక్స్‌లు బాదడంతో పాక్ భారీ స్కోరు సాధించింది.
Advertisement