
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్ విడుదల
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్-2 సూపర్ 12 స్టేజ్‌లో భారత్ తలపడనుంది. గ్రూప్-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 23న దాయాది పాకిస్థాన్‌తో భారత్ తొలిపోరు జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్ కాగా, నవంబర్ 10న రెండో సెమీస్ నిర్వహించనున్నారు. మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న ఫైనల్ జరగనుంది.
గత పొట్టి ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్ స్టేజ్ దశకే పరిమితమైంది. అంతేకాకుండా ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో ఓటమి ఎరగని టీమ్ఇండియా.. అప్పటి తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం పాలైంది. ఈ సారైనా పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. అయితే దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ టీ20 సహా అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికేశాడు. నూతన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్ఇండియా ఈసారి బరిలోకి దిగబోతోంది. అలానే కొత్త ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకంలో తొలిసారి భారత్ ఐసీసీ ట్రోఫీలో ఆడనుంది. కాబట్టి ఇది రోహిత్‌తోపాటు ద్రవిడ్‌కు అగ్నిపరీక్షే.
ఇవీ చదవండి
Advertisement