ఐర్లాండ్‌ను ఆదుకున్న డెలానీ, లిటిల్‌.. పాకిస్థాన్ లక్ష్యం 107

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 

Updated : 16 Jun 2024 21:58 IST

ఫ్లోరిడా: టీ20 ప్రపంచ కప్‌ 2024లో సూపర్‌-8 రౌండ్‌ రేసు నుంచి వైదొలగిన పాకిస్థాన్‌.. ఐర్లాండ్‌తో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని పాక్‌ భావిస్తోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఐరిష్‌ జట్టు ఒక దశలో 32 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో గారెత్ డెలానీ (31; 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మార్క్‌ అడైర్ (15; 19 బంతుల్లో) అతడికి సహకరించాడు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 14 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి ఐర్లాండ్.. టెయిలెండర్ లిటిల్ (22*; 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో వందకు పైగా స్కోరు చేసింది. 

ఐర్లాండ్ టాప్‌-5 బ్యాటర్లలో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఆండ్రూ బాల్‌బిర్నీ, హ్యారీ టెక్టార్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. పాల్ స్టిర్లింగ్ (1), లోర్కాన్ టక్కర్ (2), కార్టిస్ క్యాంఫర్‌ (7) వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. జార్జ్‌ డాక్రెల్ (11) పరుగులు చేశాడు. పాక్‌ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3, ఇమాద్‌ వసీం 3, మహ్మద్ అమిర్ 2, హారిస్ రవూఫ్‌ ఒక వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని