ashwin-kohli: కోహ్లీ ఎనర్జీ లెవల్స్ అమోఘం.. ఫిట్నెస్ సాధించడం కష్టమే: అశ్విన్
భారత సారథి విరాట్ కోహ్లీని కెప్టెన్సీని, ఆటతీరును రవిచంద్రన్ అశ్విన్ కొనియాడాడు. కోహ్లీ ఎనర్జీ లెవల్స్...
ఇంటర్నెట్ డెస్క్: భారత సారథి విరాట్ కోహ్లీని కెప్టెన్సీని, ఆటతీరును రవిచంద్రన్ అశ్విన్ కొనియాడాడు. కోహ్లీ ఎనర్జీ లెవల్స్ అమోఘమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు కోహ్లీ ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో వివరించాడు. టీ20 ప్రపంచకప్ ముగిశాక టీ20 జట్టు సారథ్యం బాధ్యతల నుంచి తప్పుకోనున్న కోహ్లీ బర్త్‌డే ఇవాళ. స్టార్‌స్పోర్ట్స్ పోస్టు చేసిన వీడియోలో సీనియర్ బౌలర్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ ఎనర్జీ లెవల్స్ అద్భుతం. ఆటను మనసారా ఆస్వాదిస్తూ ఆడతాడు. కోహ్లీ నాయకత్వంలో ఎర్రబంతి (టెస్టు ఫార్మాట్)తో ఆడినప్పుడు గమనించిన విషయం ఇదే. ఒక్కోసారి తన సారథ్యం, జట్టును నడిపించే తీరును చూసినప్పుడు కోహ్లీకి ఇంత శక్తి సామర్థ్యం ఎలా వచ్చాయో అనిపిస్తుంటుంది. మైదానంలోనూ, వెలుపల కోహ్లీ ఎంతో ఉత్సాహంగా ఉంటాడు’’ అని పేర్కొన్నాడు.
భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై అశ్విన్ స్పందిస్తూ.. ‘‘గ్రౌండ్లో ఆటగాళ్లలో కోహ్లీ నింపే స్ఫూర్తి, ఉత్తేజం బయట ఉన్నవారిపైనా ప్రభావం చూపుతుందేమోనని అనుకుంటా. జట్టులోకి కొత్త సంస్కృతిని కోహ్లీ పరిచయం చేశాడు. ఉన్నతంగా నిలబడి తమ గొంతుకను వినిపించాలనే విధంగా మార్పు తెచ్చాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లీ ఫిటెనెస్ ఎవరికీ ఉండకపోవచ్చు. తనతో సహా జట్టులోని ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోహ్లీ చూసుకుంటాడు’’ అని అశ్విన్ తెలిపాడు. దాదాపు నిమిషంపైన ఉన్న ఆ వీడియోను మీరూ చేసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్