T20 World Cup: గత ఖ్యాతితోనే జట్టులో హార్దిక్ పాండ్య, భువీ: దిలీప్ దోషి

ఈ టీ20 ప్రపంచకప్‌లోని టీమిండియా ఆడే మిగతా మ్యాచ్‌లకు ఆటగాళ్లను గతంలో సాధించిన ఖ్యాతి ఆధారంగా కాకుండా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోని ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి టీమిండియా యాజమాన్యాన్ని కోరాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య,

Published : 29 Oct 2021 21:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ టీ20 ప్రపంచకప్‌లోని టీమిండియా ఆడే మిగతా మ్యాచ్‌లకు ఆటగాళ్లను గతంలో సాధించిన ఖ్యాతి ఆధారంగా కాకుండా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి టీమిండియా యాజమాన్యాన్ని కోరాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య, ఫాస్ట్‌బౌలర్‌ భువనేశ్వర్ కుమార్‌లు గతంలో సాధించిన ఆధారంగా టీమిండియాకు ఆడుతున్నారని దోషి వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు గత కొన్ని రోజులుగా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా యాజమాన్యాన్ని కోరాడు. 

‘కొంతమంది ఆటగాళ్లు గతంలో సాధించిన ఖ్యాతి ఆధారంగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లు గత కొన్నిరోజులుగా తమ స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. హార్దిక్‌కు బాగా ఆడే సత్తా ఉంది. నిలకడగా ఆడేందుకు అతడు తన సామర్థ్యంపై దృష్టిపెట్టాలి. భువనేశ్వర్ 130 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టలేకపోతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రతి మ్యాచ్‌ ఆడాలి. ఎందుకంటే అతడు ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్‌. శార్దూల్ కచ్చితంగా ఆడాలి. అతడు గత కొన్ని రోజులుగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీపక్ చాహర్‌ కూడా జట్టులో ఉండేందుకు అర్హుడు. కొన్నేళ్లుగా జడేజా బౌలింగ్‌ క్షీణిస్తోందని నాకనిపిస్తోంది. అతడు అత్యుత్తమ ఆటగాడు. కానీ, బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోతున్నాడు. జడ్డూ తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాలి’ అని దిలీప్‌ దోషి అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని