
T20 World Cup: ఆసీస్ బౌలర్ల దెబ్బకు బంగ్లా బేజారు.. జంపాకి ఐదు వికెట్లు
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 15 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్‌కు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. ఆడమ్ జంపా (5/19) సూపర్ బౌలింగ్‌తో బంగ్లా కుదేలైంది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్(0)ను క్లీన్‌బౌల్డ్ చేసి స్టార్క్ వికెట్ల వేటను ప్రారంభించాడు. స్వల్ప వ్యవధిలో సౌమ్య సర్కార్ (5), ముష్ఫికర్ రహీమ్ (1) పెవిలియన్ బాటపట్టారు. ఓపెనర్ మహమ్మద్ నయీం (17), కెప్టెన్ మహమ్మదుల్లా (16) క్రీజ్‌లో నిలదొక్కుకున్నారనే లోపే ఔట్ కావడం బంగ్లాను కష్టాల్లోకి నెట్టింది. తర్వాత అఫిఫ్ హుస్సేన్ (0) నిరాశపరచగా.. షమీమ్ హుస్సేన్ (19) భారీ షాట్లు ఆడేందుకు యత్నించి ఆసీస్ బౌలర్ జంపా చేతికి చిక్కారు. ముస్తాఫిజర్ 4, తస్కిన్ అహ్మద్ 6* పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 5, మిచెల్ స్టార్క్ 2, హేజిల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ పడగొట్టారు.