
T20 World Cup: మోతమోగించిన మాలిక్.. పాక్ భారీ స్కోరు
ఇంటర్నెట్ డెస్క్: అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న పాకిస్థాన్ తన ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. స్కాట్లాండ్‌పై టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దీంతో స్కాట్లాండ్‌కు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (66: 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), షోయబ్ మాలిక్ ( 18 బంతుల్లో 54*: ఒక ఫోర్, 6 సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో భారీ స్కోరు సాధించింది. తొలుత నిదానంగా ఆడిన పాక్.. ఆఖర్లో చెలరేగింది. మహమ్మద్ రిజ్వాన్ (15)తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బాబర్ మొదట్లో ఆచితూచి ఆడాడు. ఫఖర్ జమాన్ (8) విఫలం కాగా.. మహమ్మద్ హఫీజ్ (31) ధాటిగా ఆడాడు. అయితే ఆఖర్లో మాలిక్ విశ్వరూపం చూపాడు. స్కాట్లాండ్ బౌలర్లలో గ్రీవ్స్ 2.. తహిర్, షరిఫ్ చెరో వికెట్ తీశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.