Sourav Ganguly: యూఏఈలోనే టీ20 ప్రపంచకప్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మెగాటోర్నీని యూఏఈకి తరలిస్తున్నామని ప్రకటించింది. కొవిడ్‌-19 ముప్పు, ఆరోగ్యం, సంక్షేమ కారణాల రీత్యా టీ20 ప్రపంచకప్‌ వేదికను మార్పు చేయక తప్పడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు....

Published : 28 Jun 2021 19:20 IST

స్పష్టం చేసిన బీసీసీఐ

దిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మెగాటోర్నీని యూఏఈకి తరలిస్తున్నామని ప్రకటించింది. కొవిడ్‌-19 ముప్పు, ఆరోగ్యం, సంక్షేమ కారణాల రీత్యా టీ20 ప్రపంచకప్‌ వేదికను మార్పు చేయక తప్పడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. ‘టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తలిస్తామని మేం ఐసీసీకి అధికారికంగా తెలియజేశాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని గంగూలీ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్లో టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్‌ ముప్పుతో ఎక్కువ జట్లు పాల్గొనే టోర్నీలను నిర్వహించడం ఇబ్బందిగా మారుతోంది. ఏప్రిల్‌లో నిర్వహించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను వైరస్‌ వల్ల అనివార్యంగా వాయిదా వేయక తప్పలేదు. బయో బుడగ ఏర్పాటు చేసినా, కట్టుదిట్టంగా ఆంక్షలు విధించినా.. వేదికలు మారడంతో వైరస్‌ కలకలం సృష్టించింది. దాంతో భారత్‌లో ప్రపంచకప్‌ నిర్వహణపై అందరికీ అనుమానాలు కలిగాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ను యూఏఈకి తరలిస్తారని మే 4న మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. కొన్నాళ్ల క్రితం జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగింది. అదే సమయంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకొనేందుకు నెల రోజుల గడువు కోరింది. మరోవైపు ప్రపంచ కప్‌నకు యూఏఈ, ఒమన్‌ను బ్యాకప్‌ వేదికలుగా ఐసీసీ ప్రకటించింది. రెండు మూడు రోజుల క్రితమే బీసీసీఐ వర్గాలు తరలింపు ఖాయమే అన్నట్టు తెలిపాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సోమవారం ఈ విషయం స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని