Kuldeep Yadav: బాలీవుడ్‌ నటితో పెళ్లి.. స్పందించిన కుల్‌దీప్‌ యాదవ్‌

Kuldeep Yadav: తన పెళ్లి విషయంలో త్వరలో అందరికీ శుభవార్త చెప్పనున్నట్లు టీమ్‌ఇండియా ఆటగాడు కుల్‌దీప్‌ యాదవ్‌ తెలిపాడు. కాన్పూర్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

Published : 08 Jul 2024 09:17 IST

Kuldeep Yadav | కాన్పూర్‌: టీ20 ప్రపంచ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో ఒకరైన కుల్‌దీప్‌ యాదవ్‌కు (Kuldeep Yadav) సొంత గడ్డ కాన్పూర్‌లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుల్‌దీప్‌ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయం వెల్లడించాడు.

తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులకు కుల్‌దీప్‌ (Kuldeep Yadav) తీపి కబురు చెప్పాడు. అయితే, గత కొంత కాలంగా ఓ బాలీవుడ్‌ నటితో అతడు స్నేహం కొనసాగిస్తున్నట్లు రూమర్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని ఆయన కొట్టిపారేశాడు. తాను పెళ్లి చేసుకోబోయేది సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదని కుండబద్దలు కొట్టాడు. తనను, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. దీనిపై త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతానని ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ కుల్‌దీప్ అన్నాడు.

102కు కూలిన జట్టే 100 తేడాతో..

మరోవైపు వరల్డ్‌ కప్‌ (T20 World Cup) గెలవడంపై కుల్‌దీప్‌ (Kuldeep Yadav) సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్షణాల కోసం చాలా కాలం నుంచి వేచి చూసినట్లు తెలిపాడు. వ్యక్తిగతం కంటే కూడా టీమ్‌గా ఈ కప్‌ భారత్‌కు చాలా అవసరమని పేర్కొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం చాలా ఉత్సాహం నింపిందని తెలిపాడు. టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో 10 వికెట్లు తీసిన కుల్‌దీప్.. టీమ్‌ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని