T20 World Cup: అందుకు ఐపీఎల్‌ను నిందించడం సరికాదు: గౌతమ్‌ గంభీర్‌

ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచి ఓటమిపాలైంది. దీంతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఒకవేళ టీమిండియా సెమీస్‌కు చేరాలంటే

Published : 04 Nov 2021 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచి ఓటమిపాలైంది. దీంతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఒకవేళ టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఈ మెగా టోర్నీలో భారత జట్టు పేలవ ప్రదర్శనకు ఐపీఎల్‌యే కారణం అని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. టీమిండియా ప్రదర్శనకు, ఐపీఎల్‌కు లింక్ పెట్టకూడదని, అలా చేయడం తప్పని గంభీర్ అన్నాడు.

‘ఐపీఎల్‌ను తప్పుపట్టవద్దు. భారత క్రికెట్‌లో ఏదైనా తప్పు జరిగితే అందరి వేళ్లు ఐపీఎల్‌ వైపే ఉంటాయి. ఇది తప్పు. రెండు, మూడు జట్లు మన కంటే బాగా ఆడుతున్నాయని కొన్నిసార్లు భావించాలి. దానిని మనం ఎంత తొందరగా అంగీకరిస్తే మనకు అంత మంచిది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ధైర్యంగా ఆడలేదు. పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలవడం నిరాశకు గురిచేసింది. కానీ, టీ20 ప్రపంచకప్‌కి, ఐపీఎల్‌కి సంబంధం ఏమిటి? 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో కూడా ఓడినప్పుడు కూడా ఈ విధంగానే ఐపీఎల్‌ను తప్పుబట్టారు’ అని గంభీర్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు