
T20 World Cup: ఈ సారి కప్ గెలిచేది ఆ జట్టే: రికీ పాంటింగ్
ఇంటర్నెట్ డెస్క్: అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై అప్పుడే అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ కూడా తన అంచనాను బయటపెట్టాడు.
వన్డే ప్రపంచకప్‌లో తిరుగులేని అధిపత్యం ప్రదర్శిస్తూ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. కానీ ఆ జట్టు ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ని ఒక్కసారి కూడా ముద్దాడలేదు. ఈ ప్రపంచకప్‌తో ఆ వెలితి తీరుతుందని రికీ పాటింగ్ అంటున్నాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలుస్తుందని పాంటింగ్ జోస్యం చెప్పాడు. ‘జోష్ ఇంగ్లిస్.. జట్టులో చోటు దక్కించుకోవడం అద్భుతంగా ఉంది. అతడు సరదాగా పరుగులు చేస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా ఈ జట్టుకు ఉందని భావిస్తున్నా’ అని రికీ పాంటింగ్ ట్వీట్ చేశాడు. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టును గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది.
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), అస్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూ వెడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.