IPL 2023: ఐపీఎల్ 2023.. ప్రారంభోత్సవంలో తమన్నా సందడి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) టోర్నీకి బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది. తాజాగా ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలకు టాలీవుడ్ భామ తమన్నా భాటియాకు పిలుపొచ్చింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఓపెనింగ్ కార్యక్రమాలు జరుగుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభం కానుంది. పది జట్లు దాదాపు రెండున్నర నెలలపాటు టైటిల్ కోసం తలపడతాయి. మరి అలాంటి మెగా టోర్నీ ప్రారంభోత్సవ వేడుకలు కూడా అట్టహాసంగా ఉండటం సహజమే కదా.. ఈ క్రమంలో టాలీవుడ్ భామ తమన్నా భాటియా (Tamannah Bhatia) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మార్చి 31 సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో తమన్నా ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఇంకా మరింతమంది స్టార్లు వచ్చే అవకాశం ఉంది.
కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు నిలిచిపోయిన ఇంటా, బయటా వేదికల్లో మ్యాచ్‌లు ఈసారి మళ్లీ జరగనున్నాయి. గతేడాది ఛాంపియన్, హార్దిక్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్‌తో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను హార్దిక్ విజేతగా నిలిపాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతోపాటు జట్టును నడిపించిన తీరు ఆకట్టుకుంది. మరోవైపు మూడేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోనీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్‌గా అభిమానులు భావిస్తున్న తరుణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెన్నైకి నాలుగు టైటిళ్లు అందించిన ధోనీ.. ముంబయి రికార్డును సమం చేయడానికి ఇదొక అవకాశం. ముంబయి ఐదు టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్