Updated : 01 Feb 2021 00:39 IST

ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా తమిళనాడు

అహ్మదాబాద్‌: అనుభవజ్ఞుడైన దినేష్‌కార్తీక్‌ సారథ్యంలో తమిళనాడు జట్టు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని మరోసారి ముద్దాడింది. అహ్మదాబాద్‌ వేదికగా బరోడా జరిగిన ఫైనల్‌ పోరులో తమిళనాడు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్రితం సారి ఫైనల్‌లో కేవలం ఒక్కపరుగు తేడాతో కర్ణాటకపై ఓడిన తమిళనాడు.. ఈ సారి పట్టుదలతో ఆడి విజయం సాధించింది. ఈ ట్రోఫీని గెలవడం తమిళనాడుకు ఇది రెండోసారి.  మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. బరోడా జట్టులో సోలంకీ(49: 55 బంతుల్లో) టాప్‌ స్కోరర్ నిలిచాడు. సేత్‌(29: 30 బంతుల్లో) రాణించాడు. మిగతవారు చేతులెత్తేయడంతో ఆ జట్టు కేవలం 120 పరుగులకే పరమితమైంది. తమిళనాడు జట్టులో మనిమరన్‌ సిద్ధార్థ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు తీసి ఆ జట్టును పేకమేడలా కూల్చాడు. అనంతరం 121 పరుగులతో బ్యాటింగ్‌ చేపట్టిన తమిళనాడు 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. తమిళనాడు జట్టులో హరినిశాంత్‌(35) టాప్‌ స్కోరర్‌. జగదీశన్‌(14), బాబా అపరాజిత్‌(29 నాటౌట్‌), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (22) షారుఖ్‌ ఖాన్‌(18 నాటౌట్‌) పరుగులు చేశారు. అద్భుతంగా బౌలింగ్‌ చేసి బరోడా జట్టును కూల్చిన  తమిళనాడు బౌలర్‌ మణిమరన్‌ సిద్ధార్థ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.


ఇదీ చదవండి..

బుమ్రా ఫాస్ట్‌ బౌలర్‌ కాదు.. లెగ్ స్పిన్నర్‌!

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని