INDw Vs ENGw: మూడు కీలక వికెట్లు డౌన్‌.. భారత్‌ స్కోరు 64/3 (11)

మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens t20 World Cup 2023) భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కష్టాల్లో పడేలా ఉంది. కీలక వికెట్లను చేజార్చుకొంది.

Updated : 18 Feb 2023 21:08 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens t20 Wolrd Cup 2023) ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా (INDw vs ENGw) నిలకడగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో 152 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ 11 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్మృతీ మంధాన (33*), రిచా ఘోష్ (1*) ఉన్నారు. దీంతో చివరి 9 ఓవర్లలో టీమ్‌ఇండియా విజయానికి 88 పరుగులు కావాలి. 

దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు నాలుగో ఓవర్‌లో ఎదురు దెబ్బ తగిలింది. షఫాలీ వర్మ (8)ను లారెన్ బెల్‌ బోల్తా కొట్టించింది. షఫాలీ-స్మృతీ తొలి వికెట్‌కు 29 పరుగులను జోడించారు. ఆ తర్వాత వచ్చిన జెమీమా (13)తో కలిసి స్మృతీ మరో 28 పరుగులను జోడించింది. కానీ, జెమీమా సాధికారికంగా ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయింది. అనంతరం వచ్చిన కెప్టెన్ హర్మన్‌ కౌర్ (4) కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరింది. ఓవైపు స్మృతీ దూకుడు ప్రదర్శిస్తున్నా.. స్కోరు బోర్డులో మాత్రం వేగం లేకుండా పోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని