Team India: కోలుకున్న రవిశాస్త్రి.. త్వరలో భారత్‌కు పయనం

బ్రిటన్‌లో పది రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు...

Published : 17 Sep 2021 11:21 IST

దిల్లీ: బ్రిటన్‌లో పది రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్రయాణం చేయాలంటే ‘ఫిట్‌ టు ఫ్లై’ పరీక్షకు హాజరు కావాల్సివుంటుంది. ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలో వారికి నెగెటివ్‌ కూడా రావాలి. ‘‘శాస్త్రి, అరుణ్, శ్రీధర్‌ కరోనా నుంచి కోలుకున్నారు. శారీరకంగా బాగానే ఉన్నారు. ఐసోలేషన్‌ను వీడారు. అయితే వాళ్లు ఫిట్‌ టు ఫ్లై సర్టిఫికేట్‌ పొందాలటే సీటీ స్కోరు 38+ రావాలి. వచ్చే రెండో రోజుల్లో కోచ్‌లు బయల్దేరతారని భావిస్తున్నాం’’ అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని