IN PICS: క్రికెటర్‌ విజయ్‌ శంకర్‌ నిశ్చితార్థం వేడుక

టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు పెళ్లి కుదిరిదింది. తమిళనాడుకు చెందిన వైశాలి విశ్వేశ్వరన్‌తో అతడికి జత కుదిరింది. తనకు నిశ్చితార్థం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజయ్‌ ప్రకటించాడు. వైశాలితో దిగిన చిత్రాన్ని పోస్ట్‌ చేసి ఉంగరం ఎమోజీని జత చేశాడు...

Published : 21 Aug 2020 13:16 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు పెళ్లి నిశ్చయమైంది. తమిళనాడుకు చెందిన వైశాలి విశ్వేశ్వరన్‌తో అతడికి జత కుదిరింది. తనకు నిశ్చితార్థం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజయ్‌ ప్రకటించాడు. వైశాలితో దిగిన చిత్రాన్ని పోస్ట్‌ చేసి ఉంగరం ఎమోజీని జత చేశాడు.

త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విజయ్‌ను టీమ్‌ఇండియా క్రికెటర్లు అభినందించారు. కేఎల్‌ రాహుల్‌, యుజువేంద్ర చాహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌, అభినవ్‌ ముకుంద్‌, జయంత్‌ యాదవ్‌ అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌కు సైతం ఈ మధ్యే పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.

విజయ్‌ శంకర్‌ 2018లో కొలంబో వేదికగా జరిగిన టీ20లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాదే ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో వన్డే కెరీర్‌ను ఆరంభించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లోనూ ఆడాడు. అయితే ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు. శంకర్‌ ఇప్పటి వరకు 12 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో అతడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. గత సీజన్‌లో ఫర్వాలేదనిపించాడు. వారం రోజుల్లో జట్టుతో కలిసి దుబాయ్‌కు వెళ్లనున్నాడు.








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని