Shardul Thakur: పెళ్లి పీటలెక్కనున్న శార్దూల్‌ ఠాకూర్‌.. పెళ్లి కూతురు ఎవరంటే?

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు అయిన మిథాలీ పారుల్కర్‌ను శార్దూల్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న వివాహం చేసుకోబోతున్నాడు.

Published : 18 Dec 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు అయిన మిథాలీ పారుల్కర్‌ను శార్దూల్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని మిథాలీ స్వయంగా వెల్లడించింది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ జంటకు గతేడాది నవంబరులో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24 వరకు శార్దూల్‌కు బిజీ షెడ్యూల్‌ ఉండటం వల్ల, పెళ్లి ముహుర్తం 27న నిర్ణయించినట్లు మిథాలీ వివరించింది. వివాహ వేడుకలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయని, ముంబయికి సమీపంలోని కర్జత్‌లో మహారాష్ట్ర పద్ధతిలో వీరి వివాహం జరగుతుందని ఆమె తెలిపింది. మిథాలీ పారుల్కర్ ఎంట్రప్రెన్యూర్‌.. మోడలింగ్‌ కూడా చేసింది. ప్రస్తుతం బేకింగ్‌ స్టార్టప్‌ని నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని