Team India: వన్డే వరల్డ్‌ కప్‌.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు

భారత్ తన వరల్డ్‌ కప్‌ జట్టులో (ODI WC 2023) మార్పులు చేస్తూ కొత్త స్క్వాడ్‌ను ప్రకటించింది. ఒకే ఒక్క మార్పుతోనే బరిలోకి దిగనుంది.

Published : 28 Sep 2023 20:04 IST

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశం వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) కోసం భారత్‌ తన తుది స్క్వాడ్‌ను ప్రకటించింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం దక్కింది. ఇదొక్క మార్పు మినహా భారత్ తన స్క్వాడ్‌ను యథాతథంగానే ప్రకటించడం విశేషం. సెప్టెంబర్ 30, అక్టోబర్ 3న రెండు వార్మప్‌ మ్యాచ్‌లను భారత్‌ ఆడనుంది. మెగా టోర్నీలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతోనే తొలి పోరు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసే దాయాదుల పోరు (IND vs PAK) అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్, హార్దిక్ పాండ్య, అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు