Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్‌

ఇటీవల టీమ్‌ఇండియాలో చోటుకోసం ఆటగాళ్ల మధ్య  పోటీ పెరిగింది.

Published : 11 Aug 2022 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల టీమ్‌ఇండియాలో చోటు కోసం ఆటగాళ్ల మధ్య  పోటీ పెరిగింది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై భారత మాజీ వికెట్‌కీపర్‌ కిరణ్‌ మోరే ఓ క్రీడా ఛానల్‌లో విశ్లేషించాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ స్థాయిని పెంచుకొని  బ్యాటింగ్‌తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలిగినందుకు మోరే అతణ్ని ప్రశంసించాడు. ఇటువంటి ఆటగాళ్లు జట్టుకు ఎల్లప్పుడూ అవసరమని చెప్పాడు.

"హార్దిక్ పాండ్యా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విధానం.. 140-147 కి.మీల వేగంతో బౌలింగ్ చేయడం.. తన కోటా బౌలింగ్ పూర్తి చేసి వికెట్లు తీయడం.. బ్యాట్‌తో కీలక సమయాల్లో పరుగులు చేస్తూ ఫినిషర్‌ పాత్ర పోషిస్తుండటం ఆకట్టుకుంది. ఈ విధమైన ఆటగాళ్లు కచ్చితంగా జట్టుకు అవసరం’అని మోరే అన్నాడు. ఇక.. ఐర్లాండ్‌ సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన హార్దిక్‌, విండీస్‌తో జరిగిన చివరి టీ20లోనూ కెప్టెన్సీ చేశాడు. దీంతో ఆటగాడిగానే కాదు.. అవకాశం ఇస్తే సారథ్య బాధ్యతలు స్వీకరిస్తానని పాండ్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని