Team India: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ఎక్కడంటే?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా ఒక స్థానం మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంతకుముందు ఐదో స్థానంలో నిలిచిన రోహిత్‌ సేన తాజాగా శ్రీలంకపై...

Updated : 15 Mar 2022 17:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా ఒక స్థానం మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంతకుముందు ఐదో స్థానంలో నిలిచిన రోహిత్‌ సేన తాజాగా శ్రీలంకపై రెండో టెస్టు గెలిచింది. దీంతో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ క్రమంలోనే తాజా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో కాస్త మెరుగైంది. మరోవైపు టీమ్‌ఇండియాకు ఈ సిరీస్‌ గెలుపు భారీ ఉపశమనం కలిగించింది. ఇంతకుముందు దక్షిణాఫ్రికాలో ఆడిన సిరీస్‌లో భారత్‌ 1-2 తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక రోహిత్‌ కెప్టెన్సీ చేపట్టాక వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా శ్రీలంకను వైట్‌వాష్‌ చేసింది. ఇక ఛాంపియన్‌షిప్‌ పట్టికలో ఆస్ట్రేలియా నంబర్‌ వన్‌ జట్టుగా కొనసాగుతుండగా.. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. తొలి డబ్ల్యూటీసీలో 14 మ్యాచ్‌లకుగాను 79 వికెట్లు తీసిన అశ్విన్‌.. రెండో డబ్ల్యూటీసీ పోటీల్లో ఏడు మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో 21 టెస్టుల్లో 100 వికెట్లను తీశాడు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న రెండో డబ్ల్యూటీసీలో ఆరోస్థానంలో కొనసాగుతున్నాడు. అందరికంటే బుమ్రా (40) ఎక్కువ వికెట్లను తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని