ICC Rankings: భారత్‌దే ఆధిపత్యం

సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో...

Updated : 13 May 2021 15:09 IST

దుబాయ్‌: సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఒక పాయింటు తేడాతో న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టింది. ఇంగ్లాండ్‌ మూడు, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో నిలిచాయి. మరికొన్ని రోజుల్లో టీమ్‌ఇండియా, కివీస్‌ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

భారత్‌ 121 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఇక మొత్తంగా 24 మ్యాచుల్లో 2914 పాయింట్లు అందుకొంది. మరోవైపు కివీస్‌ 120 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ 18 టెస్టులాడి  మొత్తం 2,166 పాయింట్లు సంపాదించింది. ఆసీస్‌పై 2-1, ఇంగ్లాండ్‌పై 3-1 తేడాతో గెలవడం కోహ్లీసేనకు ఉపయోగపడింది. వెస్టిండీస్‌, పాకిస్థాన్‌పై 2-0 తేడాతో సిరీసులు గెలవడం కివీస్‌ను ముందుకు తీసుకొచ్చాయి.

ఐసీసీ 2020 నుంచి జరిగిన మ్యాచులకు 100%, అంతకు ముందు రెండేళ్లకు 50% పాయింట్ల ఆధారంగా రేటింగ్స్‌ ఇచ్చింది. ఇంగ్లాండ్‌ (109) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలవడగా ఒక స్థానం తగ్గిన ఆస్ట్రేలియా (108) నాలుగుకు చేరుకుంది. పాకిస్థాన్‌ (94), వెస్టిండీస్‌ (84) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా (80), శ్రీలంక (78), బంగ్లాదేశ్ (46), జింబాబ్వే (10) వరుసగా చివరి స్థానాలకు పరిమితం అయ్యాయి. దక్షిణాఫ్రికా తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్థాయికి రావడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు