Team India: టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లపట్టికలో టీమ్‌ఇండియా ఎక్కడ?

దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టేబుల్‌ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పర్యటనలో భారత్‌ తొలి టెస్టులో సఫారీలను ఓడించినా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా...

Updated : 09 Jan 2022 11:41 IST

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పర్యటనలో భారత్‌ తొలి టెస్టులో సఫారీలను ఓడించినా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఒక పాయింట్‌ కోల్పోయింది. అలాగే రెండో టెస్టులో విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కోహ్లీసేన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లు ఉన్నాయి. అయితే, విజయాల శాతం పరంగా చూస్తే భారత్‌ అత్యధికంగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి రెండు ఓటముల పాలైంది. దీంతో 55.21 విజయశాతంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక ఆసీస్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలవగా.. శ్రీలంక ఆడిన రెండిటిలోనూ విజయం సాధించింది. అలా ఈ రెండు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు పాక్‌ మూడు మ్యాచ్‌లు గెలిచి ఒకటి ఓటమిపాలై మూడో స్థానంలో కొనసాగుతోంది.

కేప్‌లో ఘన స్వాగతం..

ఇక టీమ్‌ఇండియా జట్టుకు శనివారం కేప్‌టౌన్‌లో ఘన స్వాగతం లభించింది. ఇటీవలే జోహానెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమిపాలైన భారత జట్టు మూడో టెస్టు కోసం శనివారం కేప్‌టౌన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లకు అక్కడి హోటల్‌ సిబ్బంది స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని