IND vs SA: సఫారీలతో వన్డే సిరీస్‌.. భారత జట్టులోకి యువ ఆటగాళ్లు

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ముగిశాక.. మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ నాయకత్వంలో భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Published : 02 Oct 2022 19:10 IST

ముంబయి: అక్టోబర్‌ 6వ తేదీ ( గురువారం) నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ్‌కు శిఖర్ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 సిరీస్‌కు పక్కన పెట్టడం విమర్శలు రావడంతో సంజూ శాంసన్‌కు వన్డే సిరీస్‌లో అవకాశం కల్పించింది. అలాగే భారత టీ20 లీగ్‌లో మెరిసిన యువ ఆటగాళ్లు రజత్‌ పాటిదార్, రాహుల్‌ త్రిపాఠికి స్థానం దక్కింది. బుమ్రా స్థానంలో టీ20 సిరీస్‌కు ఎంపికైన మహమ్మద్‌ సిరాజ్‌ను కూడా కొనసాగించడం గమనార్హం. కుల్‌దీప్, రవి బిష్ణోయ్‌, షహబాజ్ అహ్మద్‌తో కూడిన స్పిన్‌ దళం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. ప్రస్తుతం భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే.

భారత జట్టు: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్‌ గిల్‌, రజత్‌ పటిదార్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, షహబాజ్‌ అహ్మద్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని