Team India Slip Cordon: టీమ్‌ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?

టెస్టు క్రికెట్‌ (Test Cricket)లో కీలకమైన స్లిప్‌ కార్డన్‌ (Slip Cordon) గురించి ఛాట్‌జీపీటీ (ChatGPT)ని అడిగితే... ఆసక్తికర సమాధానం చెప్పింది. 

Updated : 10 Jun 2023 12:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్టు క్రికెట్‌ అనగానే మన కళ్ల ముందు కదలాడేది రైలు బండిలా నిలబడే స్లిప్‌ ఫీల్డర్లు. బంతి వేయడానికి బౌలర్‌ పరుగు ప్రారంభించగానే.. ఎడ్జ్‌ తీసుకొని వచ్చే క్యాచ్‌ల కోసం రెడీ అయిపోతారు వీళ్లంతా. వీరందరినీ కలిపి స్లిప్‌ కార్డన్‌ అని అంటారు. ఈ ఫీల్డ్‌ సెటప్‌ టెస్టుల్లో చాలా కీలకం అని చెప్పొచ్చు. మన దేశంలోనూ ఈ ప్లేస్‌లో ఫీల్డ్‌ చేయడానికి స్టార్‌ ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్లంతా దీని కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ కూడా చేస్తుంటారు. అంతటి కీలకమైన ఫీల్డింగ్‌ ప్లేస్‌లో ఎవరు ఉంటే బాగుంటుంది అని ఛాట్‌జీపీటీని అడిగితే ఈ పేర్లు చెప్పింది. అంతేకాదు వారెందుకు అక్కడ ఉండాలి అనేది కూడా వివరించింది. 

విరాట్‌ కోహ్లీ (Virat Kohli)

బ్యాటింగ్‌లో విరాట్‌ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే స్లిప్‌ ఫీల్డింగ్‌లో అతని  ప్రతిభ గురించి కూడా. స్లిప్‌ కార్డన్‌లో ఉండే ఫీల్డర్‌కు కావాల్సిన చురుకుతనం, ఊహించే తత్వం అదిరిపోతాయి. వీటికితోడు అక్కడ నిల్చొని బౌలర్లను ఎంకరేజ్‌ చేసే విధానం ఇంకా బాగుంటుంది. 

అజింక్య రహానె (Ajinkya Rahane)

భారత జట్టులో స్లిప్‌ కార్డన్‌ రెగ్యులర్‌ ఫీల్డర్‌ల లిస్ట్‌ రాస్తే అందులో అజింక్య రహానె పేరు కచ్చితంగా ఉంటుంది. మ్యాచులో కీలక సమయాల్లో క్లిష్టమైన క్యాచులు తీసుకొని గెలిపించిన సందర్భాలు గతంలో మనం చాలా చూశాం. 

ఛెతేశ్వర్‌ పుజారా (Cheteswar Pujara)

క్రీజులో గంటల తరబడి నిలదొక్కుకుని బ్యాటింగ్‌ చేయడమంటే ప్రస్తుతం టీమ్‌ ఇండియాలో మనకు గుర్తొచ్చేది ఛెతేశ్వర్‌ పుజారా. స్లిప్‌ ఫీల్డర్‌కు ఉండాల్సిన టెక్నిక్‌, ఏకాగ్రత పుజారాలో మెండు. ఇదే అతనిని బెస్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ను చేసింది. 

రోహిత్‌ శర్మ (Rohit Sharma)

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ లిస్ట్‌లో నాలుగోవాడు. బంతిని గమనించి వేగంగా రియాక్ట్‌ అవ్వడం, బంతిని అందుకోవడంలో చూపించే బాడీ లాంగ్వేజ్‌ అతనిని ఈ జాబితాలోకి తీసుకొచ్చాయి. 

శిఖర్‌ ధావన్‌ (Shikar Dhawan)

భారత జట్టు విదేశాల్లో పర్యటించేటప్పుడు బెస్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ అంటే శిఖర్‌ ధావన్‌ అని చెప్పొచ్చు. అక్కడి పిచ్‌లకు శిఖర్‌ స్లిప్‌ ఫీల్డింగ్‌ నప్పుతుంది. గతంలో విదేశీ సిరీస్‌ల్లో శిఖర్‌ మంచి క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని