WTC Final : WTC ఫైనల్‌.. భారత జట్టు ఇదే..

ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌( ICC World Test Championship 2023 Final) మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Updated : 25 Apr 2023 12:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపీఎల్‌ టోర్నీ ముగియగానే.. మరో మెగా సమరం క్రికెట్‌ అభిమానులను పలకరించనుంది. అదే ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (ICC World Test Championship 2023 Final) మ్యాచ్‌. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ జట్ల మధ్య జూన్‌ 7-11 తేదీల్లో ఓవల్‌ మైదానం వేదికగా ఈ టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఒకవేళ మ్యాచ్‌ ఫలితం తేలకుంటే 12వ తేదీని రిజర్వ్‌ డేగా ప్రకటించారు.

ఇక ఈ మెగా ఫైనల్‌కు టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్‌ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఇందులో మిస్టర్‌ 360గా పేరున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు కల్పించకపోవడం గమనార్హం. మరోవైపు తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌లో చెన్నై తరఫున అదరగొడుతున్న రహానేను జట్టులోకి తీసుకుంది. తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేసింది.

భారత జట్టు ఇదే : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని