Virat Kohli: హఠాత్తుగా ముంబయి వెళ్లిన విరాట్ కోహ్లీ.. కారణమిదేనా..?
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. జట్టు నుంచి బ్రేక్ తీసుకుని హఠాత్తుగా ముంబయి వెళ్లాడు. వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ (World Cup 2023) ప్రారంభానికి ముందు తన రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా (Team India) జట్టు తిరువనంతపురం చేరుకుంది. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టుతో కలిసి రాలేదని తెలుస్తోంది. హఠాత్తుగా అతడు ముంబయి వెళ్లినట్లు స్పోర్ట్స్ మీడియా సంస్థలు కథనాల్లో వెల్లడించాయి.
తొలి వార్మప్ మ్యాచ్ రద్దుతో భారత జట్టు.. గువాహటి నుంచి తిరువనంతపురం బయల్దేరింది. అయితే, కోహ్లీ మాత్రం జట్టు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకుని ముంబయి విమానం ఎక్కినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ (BCCI) విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు జట్టును వీడినట్లు సదరు వర్గాలు తెలిపాయి. కోహ్లీ (Virat Kohli).. సోమవారం తిరిగి జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్
విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) రెండోసారి తల్లికాబోతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. అతడు ముంబయి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వీరిద్దరూ ముంబయిలోని ఓ గైనకాలజీ ఆసుపత్రి వద్ద కన్పించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2017 కోహ్లీ, అనుష్క వివాహం జరగ్గా.. 2021 జనవరిలో వీరికి వామిక జన్మించింది.
ఇక, గువాహటి వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీకి ముందు చివరిదైన రెండో వార్మప్ మ్యాచ్.. మంగళవారం తిరువనంతపురంలో జరగనుంది. నెదర్లాండ్స్‌తో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇక, ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 8న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడతా
జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఆసీస్ ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. -
సివర్, వ్యాట్ ధనాధన్
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. -
టీ20ల్లో బిష్ణోయ్ నంబర్‌వన్
భారత యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో నంబర్‌వన్ బౌలర్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్. -
టైటాన్స్ మరోసారి..
ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్ కెప్టెన్ పవన్ సెహ్రావత్‌ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. -
గిల్ 400 చేయగలడు
క్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ బద్దలు కొడతాడని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. 2004లో ఇంగ్లాండ్‌తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. -
దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా
సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. -
క్రికెట్ మరీ ఎక్కువైపోతోంది.. అందుకే ఆల్‌రౌండర్ల కొరత
అన్ని ఫార్మాట్లలో అతి క్రికెట్ వల్లే నాణ్యమైన ఆల్‌రౌండర్లు రావట్లేదని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్. చరిత్రలోనూ ఆల్‌రౌండర్లు ఎక్కువగా లేరని అన్నాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా పేరున్న కలిస్ మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకుపైగా పరుగులు చేశాడు. -
ఒక్క రోజే 15 వికెట్లు
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. -
వోజ్నియాకికి ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్‌కార్డ్
మహిళల మాజీ నంబర్‌వన్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్)కి 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్ లభించింది. తొలి దశలో ఆమెతో పాటు ఆరుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్‌కార్డులు ఇచ్చారు.