Updated : 17 Nov 2021 23:47 IST

IND vs NZ: ఉత్కంఠభరిత పోరులో కివీస్‌పై టీమ్‌ఇండియా విజయం

 ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో న్యూజిలాండ్‌పై భారత్‌ అతికష్టంమీద విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 ఈ నెల 19న జరగనుంది.

ఇంటర్నెట్‌ డెస్క్: జయపుర వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 5  వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (62: ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌లు), కెప్టెన్‌ రోహిత్ శర్మ (48: ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు. రోహిత్ ఔటైనా.. సూర్యకుమార్‌ ధాటిగానే బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో టీ20  కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌ కివీస్‌ బౌలర్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. రిషభ్‌ పంత్ 17*, శ్రేయస్‌ అయ్యర్ 5, వెంకటేశ్‌ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాట్నర్‌ తలో వికెట్‌ తీశారు. 

కివీస్‌ను వారిద్దరే ఆదుకున్నారు.. 

టాస్ ఓడిన కివీస్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (70)తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ చాప్‌మన్‌ (63) ధాటిగా ఆడాడు. వీరిద్దరూ కలిసి శతక (109) భాగస్వామ్యం నిర్మించారు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆఖర్లో కివీస్‌ స్కోరుబోర్డు నెమ్మదించింది. ఫిలిప్స్‌ డకౌట్‌గా వెనుదిరిగా.. సీఫర్ట్‌ 12, రచిన్‌ 7, సాట్నర్ 4* పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ 2, అశ్విన్‌ 2.. దీపక్‌ చాహర్, సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని