AFG vs IND: చెలరేగిన బౌలర్లు.. అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్‌

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌ 134 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

Updated : 21 Jun 2024 09:25 IST

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 రౌండ్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.అఫ్గానిస్థాన్‌పై రోహిత్‌ సేన 47 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (53; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ లక్ష్యఛేదనలో ఆది నుంచి తడబడ్డ  అఫ్గానిస్థాన్‌ సరిగ్గా 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్‌ స్కోరర్. నజీబుల్లా జద్రాన్ (19), గుల్బాదిన్ నైబ్ (17), మహ్మద్ నబీ (14), రహ్మనుల్లా గుర్బాజ్ (11) పరుగులు చేశారు. హజ్రతుల్లా జజాయ్ (2), ఇబ్రహీం జద్రాన్ (8) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో బుమ్రా (3/7) అద్భుత ప్రదర్శన చేశాడు. అర్ష్‌దీప్‌ సింగ్ 3, కుల్‌దీప్‌ యాదవ్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. 

తొలుత భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌తో పాటు హార్దిక్ పాండ్య (32; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ (24), రిషభ్ పంత్ (20; 11 బంతుల్లో 4 ఫోర్లు) భారీ స్కోర్లు చేయలేకపోయారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబె (10) నిరాశపర్చారు. అక్షర్ పటేల్ (12; 6 బంతుల్లో) ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 3, రషీద్ ఖాన్ 3, నవీనుల్ హక్ ఒక వికెట్ తీశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని