USA vs IND: అమెరికాపై విజయం.. సూపర్‌-8కు దూసుకెళ్లిన భారత్‌

క్రికెట్‌ పసికూన అమెరికాపై భారత్‌ 7 వికెట్ల తేడాతో కష్టంగా నెగ్గి సూపర్‌ 8కు దూసుకెళ్లింది. 

Updated : 12 Jun 2024 23:53 IST

న్యూయార్క్‌: టీ20 ప్రపంచ కప్‌ 2024లో భారత్ వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచి సూపర్‌-8కు చేరింది. న్యూ యార్క్‌ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ (3), విరాట్ కోహ్లీ (0) నిరాశపర్చగా.. రిషభ్ పంత్ (18) పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (50*; 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ శతకం సాధించాడు. శివమ్ దూబె (31*; 35 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. యూఎస్ఏ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్‌ 2, అలీ ఖాన్‌ ఒక వికెట్ పడగొట్టారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అమెరికా జట్టులో నితీశ్ కుమార్ (27) టాప్‌ స్కోరర్‌. స్టీవెన్ టేలర్ (24), కోరె అండర్సన్ (14), ఆరోన్ జోన్స్ (11), హర్మీత్ సింగ్ (10), షాడ్లి వాన్‌ (11) పరుగులు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ (4/9) టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. హార్దిక్‌ పాండ్య (2/14) కూడా మెరిశాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.

అమెరికాకు ఐదు పరుగుల పెనాల్టీ

ఈ మ్యాచ్‌లో అమెరికాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. భారత్‌ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు కొత్త ఓవర్‌ను ప్రారంభించడానికి మూడుసార్లు 60 సెకన్ల సమయం తీసుకుంది యూఎస్ఏ. దీంతో నిబంధనల ప్రకారం అమెరికాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. 16 ఓవర్‌ ప్రారంభమయ్యే ముందు ఈ పరుగులను టీమ్‌ఇండియా  ఖాతాలో కలిపారు. 

  • న్యూ యార్క్‌లో ఇదే అత్యధిక పరుగుల ఛేదన. 
  • 9 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని