ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం పంత్‌ ముందడుగు

ఉత్తరాఖండ్‌లో ఆదివారం అనూహ్యంగా సంభవించిన జల ప్రవాహంలో ఇప్పటికే 8 మంది మృతిచెందగా సుమారు 170 మంది గల్లంతయ్యారు...

Updated : 08 Feb 2021 09:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరాఖండ్‌లో ఆదివారం అనూహ్యంగా సంభవించిన జల ప్రళయంలో ఇప్పటికే 14 మంది మృతిచెందగా సుమారు 170 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం పట్ల యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురైంది. వరదల్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ప్రార్థిస్తున్నారు. యువ ఆటగాడు రిషభ్‌పంత్‌ ఒక అడుగు ముందుకేసి వరద బాధితులను కాపాడేందుకు తనవంతుగా మ్యాచ్‌ ఫీజును వితరణగా ఇవ్వనున్నట్లు తెలిపాడు.

* ఉత్తరాఖండ్‌లో అనూహ్యంగా సంభవించిన వరదల కారణంగా తమ వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇంకా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆశిస్తున్నా. ఈ దుర్ఘటన ఎంతో కలచివేసింది. బాధితులను కాపాడేందుకు నా వంతుగా మ్యాచ్‌ ఫీజును విరాళంగా ఇవ్వదల్చుకున్నా.   -రిషభ్‌ పంత్‌

* ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడ్డాయని తెలిసింది. ఎంతో బాధగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా.   -సురేశ్‌ రైనా

* ఉత్తరాఖండ్‌ వరద బాధితులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుంటే.. లేదా ఏదైనా సహాయం కావాలంటే ఈ నంబర్లను సంప్రదించండి. 1070, 9557444486. -వీరేంద్ర సెహ్వాగ్‌

* వరద బాధితులంతా ధైర్యంగా ఉండండి. అందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.  -హర్భజన్‌సింగ్‌ 

* ఉత్తరాఖండ్‌ జల ప్రళయ బాధితులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.  -శిఖర్‌ ధావన్‌

* ఉత్తరాఖండ్‌లో జరిగిన విషాదం గురించి తెలిసి ఎంతో బాధకు గురయ్యాను. బాధితులంతా క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా. -వీవీఎస్‌ లక్ష్మణ్‌

 

ఇవీ చదవండి..
దేవభూమిలో జలవిలయం
వారెవా మేయర్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని