Tokyo Olympics: ప్రపంచ నంబర్‌వన్‌కు పతకం దక్కలేదు..!

ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌, సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. నిన్న పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో జర్మనీ

Published : 31 Jul 2021 15:36 IST

కాంస్యం చేజార్చుకున్న జకోవిచ్‌

టోక్యో: ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌, సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. నిన్న పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో పరాజయం చవిచూసిన జకో.. కాంస్యం పోరులోనూ ఓటమిపాలయ్యాడు. శనివారం కారెన్‌ బుస్టా(స్పెయిన్‌)తో జరిగిన మ్యాచ్‌లో 4-6, 7-6(6), 3-6 తేడాతో ఓడి.. పతకం కోల్పోయాడు. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం కోసం నీనా స్టొజనోవిచ్‌తో కలిసి ఈ సాయంత్రం ఆస్ట్రేలియా జోడీపై పోరాడనున్నాడు. 

2021ను హుషారుగా ఆరంభించిన జకోవిచ్‌.. ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టైటిళ్లు గెలిచాడు. ఒలింపిక్స్‌లో గెలిచి, యుఎస్‌ ఓపెన్‌ సాధిస్తే గోల్డెన్‌స్లామ్‌ సాధించేవాడు. అయితే సెమీస్‌లో ఓటమితో ఆ అవకాశం కోల్పోయాడు. కాగా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జకో.. కాంస్య పతకం గెలుచుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని